Wednesday, 31 October 2018

Swami Vivekananda - Telugu Inspirational Song Telugu Lyrics - "Aarambha Mou Prachanda Maina Yudha May Akhanda Maina"

పల్లవి:
ఆరంభమౌ ప్రచండమైన  - యుద్ధమే అఖండమైన
శంఖరావలాపనే పూరించుదాం.

జాతి ప్రీతి గాంఛే ఖ్యాతి  - పదములోన యుద్ధ రీతి
నీతి గానే విజయము సాధించుదాం.
|| ఆరంభమౌ ||
ఇది సమరమే ఆరం...భం.

చరణం:
తలచినంత ప్రాణార్పణ – తెగువ తేల్చు సంఘర్షణ
సమరానికి సిద్ధమెపుడు వీరుడు.

కృష్ణ గీత సారమిది – దైవ శాసనాల విధి
యుద్ధానికి జంకడెపుడు యోధుడు.

అనునయులే ఎదురించిన – సహచరులే వారించిన
ధర్మానికే బాద్యుడెపుడు ధీరుడు

తలవంచని స్వభావాలు – రాజసమే ఆనవాలు
ఒడిదుడుకులకు ఎదురేగే తత్వము.

అలుపెరుగని సాహసాల – ఎగిరేయిక భావుటాలు
నలుదిక్కుల చాటు ఆధిపత్యము                                                          || ఆరంభమౌ ||

ఇది సమరమే ఆరం...భం.


చరణం:
అధైర్యవంత మా భావన – శౌర్యమంత మా స్పందన   
ఓటమినిదా ఆక్రందన ఎంచుకో..

నిలువరించి ఆవేదన - దీక్షబూని చెయి సాధన
ప్రతిఘటించి బలహీనత వదులుకో..

బ్రంహాండమంత నిలదీసిన - ఒంటరిగా వెలివేసిన
సంకల్పం సడలకుండా నడుచుకో..

సమయమునే వృధా పరుచు – సుఖములకై పరితపించు
హృది తలపుల సంక్కెల్లనే తెంచుకో..

ఉప్పెనలో బడిబాగ్ని  - రక్తములో మరిగేట్టు
పోరాటపు పౌరుషమే పెంచుకో..

Voice
ఏ అడ్డుగోడనైన తొలగించే
ఏ పర్వతానైన పెకిలించే
ఏ సాగారనైన మదించే 
ఏ ఆకాశంనైన అధిగమించే
ఏ లక్ష్యానైన బెదించే
ఏ అలవాటునైన శాసించే  శక్తి మీలోనే నిగుడంగా దాగుంది.
మనస్పూర్తిగా ప్రయత్నిస్తే లక్షల మందికి స్ఫూర్తి అవుతారు
మీరు గెలిస్తే కోట్ల మందికి వెలుగౌతారు
అనుకున్నది సాధిస్తే చరిత పుటల్లో చేరి పోతారు

జై హింద్

No comments:

Post a Comment